థానేలో ఆక్సిజన్‌ కొరత.. ఆరుగురి మృతి

మహారాష్ట్రలో థానేలోని వేదాంత్‌ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఆరుగురు కరోనా రోగులు మృతి చెందారు. కాగా, ఇటీవల దిల్లీలోనూ ఇ

Published : 26 Apr 2021 13:07 IST

ముంబయి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ఆక్సిజన్‌ అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర థానేలోని వేదాంత్‌ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఆరుగురు కరోనా రోగులు మృతి చెందారు. కాగా, ఇటీవల దిల్లీలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్‌ గోల్గెన్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 20 మందికి పైగా రోగులు మృత్యువాత పడ్డారు.

మరోవైపు మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 66వేల పైచిలుకు కేసులు నమోదు కాగా, మరణాలు రికార్డు స్థాయిలో 832 మంది మరణించారు. పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత నెలకొందని.. పరిస్థితిని చక్కదిద్దాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని