Drugs: కేరళ తీరంలో రూ.1,200 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

బోటు ద్వారా డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురు సభ్యుల విదేశీ ముఠాను భారత నౌకాదళం అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి 200 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. నిందితులను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులకు అప్పగించింది

Published : 07 Oct 2022 23:52 IST

కోచి: బోటు ద్వారా డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురు సభ్యుల విదేశీ ముఠాను భారత నౌకాదళం అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి 200 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. అనంతరం నిందితులను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులకు అప్పగించింది. నిందితులను పాకిస్థాన్‌, ఇరాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఇరాన్‌ రిజిస్ట్రేషన్‌తో వారు ప్రయాణిస్తున్న బోటును కూడా నేవీ సిబ్బంది సీజ్‌ చేశారు. ఈ డ్రగ్స్‌ విలువ రూ.1,200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోచి సముద్రతీరానికి 1200 నాటికల్‌ మైళ్ల దూరంలో నిందితులను పట్టుకున్నట్లు నేవీ అధికారులు తెలిపారు.

రూ.100కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రూ.100కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కొట్టాయంకు చెందిన బినుజాన్‌ అనే వ్యక్తిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేశారు. ఘనా దేశానికి చెందిన ఓ మహిళ దిల్లీలోని ఓ హొటల్‌లో అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు ఆమెను విచారించడంతో అసలు విషయం బయటికొచ్చింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ముంబయి ఎయిర్‌పోర్టులో బినుజాన్‌ లగేజీని తనిఖీ చేయగా 16 కేజీల హెరాయిన్‌ బయటపడింది. ఆఫ్రికాదేశమైన మలావి నుంచి డ్రగ్స్‌ను దిల్లీ, ముంబయికి బినుజాన్‌ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని