Odisha: ఈదురుగాలులకు కదిలిన గూడ్స్ రైలు బోగీలు.. ఆరుగురి మృతి
ఒడిశాలో ఇటీవల జరిగిన రైలు దుర్ఘటన మరువక ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈదురుగాలులతో గూడ్స్ రైలు కదిలి ఆరుగురి రైల్వే కార్మికులు మృతి చెందారు.

ఝాజ్‌పూర్: ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడి ఝాజ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలుకు చెందిన నిరూపయోగ బోగీ చక్రాల కింద నలిగి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. రైల్వే స్టేషన్‌లో కొంతకాలంగా ఇంజిన్ లేని గూడ్స్ రైలు నిలిపి ఉంది. బుధవారం రైల్వే మరమ్మతులు చేయడానికి కార్మికులు రాగా.. ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం పడింది. దీంతో గూడ్స్ బోగీ కింద రైల్వే కార్మికులు తలదాచుకున్నారు. ఆ సమయంలో భారీ ఈదురుగాలులకు బోగీలు కదలడంతో రైలు చక్రాల కింద నలిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కటక్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ