వ్యాక్సిన్‌తో చిన్నపాటి చర్మ సమస్యలు!

దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. మరోవైపు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. కేసుల  సంఖ్య తగ్గేందుకు ఇది కూడా కారణం కావొచ్చు. అయితే, వ్యాక్సిన్‌ వేయించుకున్న కొందరిలో

Published : 23 Jun 2021 01:22 IST

అతిగా ఊహించుకుని భయపడవద్దు!

దిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. మరోవైపు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. కేసుల  సంఖ్య తగ్గేందుకు ఇది కూడా కారణం కావొచ్చు. అయితే, వ్యాక్సిన్‌ వేయించుకున్న కొందరిలో చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు  వైద్యులు గుర్తించారు. ఇలాంటి  కేసులు దిల్లీ, ముంబయిలో ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. అయితే దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత చాలా మందికి  నీరసం,  జర్వం, ఒళ్లునొప్పులు వస్తున్నాయి. కానీ, మరికొంత మందిలో దద్దుర్లు, చర్మం ఎర్రగా మారిపోవడం లాంటి లక్షణాలను దిల్లీలోని కొందరు వైద్యులు గుర్తించారు.  మరోవైపు ముంబయిలోనూ ఇదే తరహా కేసులు వెలుగు చూశాయి.  అయితే , వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత జర్వం రావడం వల్లనే ఇలా దద్దుర్లు ఏర్పడినట్లు చర్మ వైద్యులు చెబుతున్నారు. దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనినే అతిగా ఊహించుకొని టీకా తీసుకునేందుకు వెనకాడవద్దని వైద్యులు అంటున్నారు. 

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత  జర్వం రావడం మూలంగా ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చని చెబుతున్నారు. ‘వ్యాక్సిన్‌ వేయించుకున్నాక శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉత్తేజితమవుతుంది. భవిష్యత్తులో కరోనా వైరస్‌ శరరంలోకి ప్రవేశిస్తే దానిని గుర్తించి, పోరాడేందుకు ముందుగానే మన శరీరం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సహజం.  శరీరంలో వేడి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల చిన్నపాటి దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అలా అని ఈ లక్షణాలు అందరిలోనూ కనిపించాలనేం లేదు’ అని దిల్లీలోని ఓ ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు