Published : 14 Aug 2022 02:39 IST

Tamilnadu: తమిళనాడు మంత్రి కారుపై చెప్పు విసిరిన ఘటన.. భాజపా కార్యకర్తల అరెస్ట్‌

చెన్నై: తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ కారుపై చెప్పు విసిరిన ఘటన మధురైలో శనివారం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో పోలీసులు అయిదుగురు భాజపా కార్యకర్తలను అరెస్టు చేశారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన రైఫిల్‌మెన్ డి.లక్ష్మణన్‌కు నివాళులర్పించేందుకు మంత్రి  మధురై వచ్చారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై సైతం వస్తుండటంతో.. ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చాయి. అయితే.. కలెక్టర్‌, ఇతర అధికారిక సభ్యులు మాత్రమే ఇందులో భాగం కావాలని.. లేకపోతే మిలటరీ ప్రొటోకాల్ ఉల్లంఘనే అవుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు యత్నించగా.. భాజపా కార్యకర్తలను తరలించాలని మంత్రి ఆదేశించారని ప్రచారం జరిగింది. దీంతో భాజపా కార్యకర్తలు ఒక్కసారిగా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. నివాళులర్పించిన అనంతరం మంత్రి తిరిగి వెళ్తుండగా.. ఆయన వాహనంపై చెప్పు విసిరారు. దీంతో ఈ ఘటనలో పోలీసులు అయిదుగురు భాజపా కార్యకర్తలను అరెస్టు చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని