Rahul Gandhi: ఎన్డీయే నేతలు కొందరు మాతో టచ్‌లో ఉన్నారు: రాహుల్ కీలక వ్యాఖ్యలు

కేంద్రంలో భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

Published : 18 Jun 2024 14:47 IST

దిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ (Modi) నేతృత్వంలోని కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని, దానిలోని కొందరు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈమేరకు ఆయన మాట్లాడారు.

అధికార కూటమి నేతలు కొందరు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పిన రాహుల్‌.. దానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ‘‘మోదీ నేతృత్వంలోని కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశం ఉంది. అది బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. అలాగే ఎన్నికల వేళ మోదీ చేసిన ప్రసంగాలను ఉద్దేశించి విమర్శలు చేశారు. ‘‘మీరు విద్వేషాన్ని వ్యాప్తి చేసి.. దాని ఫలితాలను పొంది ఉండొచ్చు. అయితే ఈసారి ఆ ఆలోచనను ప్రజలు తిరస్కరించారు. ఎటువంటి వివక్ష లేని పరిస్థితులు ఉంటే.. విపక్ష ‘ఇండియా’ కూటమి నిస్సందేహంగా మెజార్టీ దక్కించుకొని ఉండేదన్నారు. మా చేతులు కట్టేసిన పరిస్థితుల్లో మేం పోరాడాం. అలాంటి సమయాల్లో ఏం చేయాలో ప్రజలకు కచ్చితంగా తెలుసు’’ అని అన్నారు.

రాయ్‌బరేలీనే ఎంచుకున్న రాహుల్‌..వయనాడ్‌ బరిలో ప్రియాంకా గాంధీ

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా స్వయంగా మెజార్టీ సాధించింది. కానీ ఈసారి మాత్రం 240 సీట్ల వద్దే ఆగిపోయింది. దాంతో ఎన్డీయే కూటమి పక్షాలపై ఆధారపడక తప్పలేదు. మరోవైపు కాంగ్రెస్ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈసారి 99 స్థానాలు దక్కించుకుంది. ఇండియా కూటమి పార్టీలకు 230కి పైగా సీట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రాహుల్ నుంచి స్పందన వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని