
Updated : 23 Jan 2022 05:13 IST
Smriti Irani: లతా దీదీ కుటుంబం తరఫున స్మృతి ఇరానీ పోస్టు
వదంతులు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి
దిల్లీ: ప్రముఖ గాయని లతా మంగేష్కర్(92)కు కొద్ది రోజుల క్రితం కరోనా సోకడంతో ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటినుంచి ఆమె ఆరోగ్యం గురించి వదంతులు వస్తున్నాయి. దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. లతా కుటుంబ సభ్యుల సందేశాన్ని వెల్లడించారు. ఆమెకు వైద్యం అందిస్తోన్న వైద్యుల ప్రకటనను ట్విటర్లో షేర్ చేశారు.
‘వదంతులు వ్యాప్తి చేయొద్దని లతా దీదీ కుటుంబసభ్యులు అభ్యర్థిస్తున్నారు. ఆమె చికిత్సకు మెరుగ్గా స్పందిస్తున్నారు. అన్నీ సహకరిస్తే త్వరలో ఇంటికి తిరిగి వస్తారు. ఈ సమయంలో వదంతులకు దూరంగా ఉండండి. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అంటూ స్మృతి ట్విటర్ వేదికగా అభ్యర్థించారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :