Manipur Violence: విద్యార్థుల దారుణ హత్యతో వేడెక్కిన మణిపుర్.. పెల్లుబికిన నిరసనలు

Manipur Violence: జాతుల మధ్య వైరంతో ఇంతకాలం మండిపోయిన మణిపుర్‌లో మంటలు చల్లారుతున్న వేళ.. విద్యార్థుల హత్య ఘటన కలకలం రేపింది. దాంతో ఈ ఈశాన్య రాష్ట్రం మరోసారి వేడెక్కింది.

Published : 26 Sep 2023 17:47 IST

ఇంఫాల్‌: ఇప్పుడిప్పుడే ఆంక్షల చట్రం నుంచి బయటపడుతోన్న మణిపుర్‌(Manipur)లో తాజాగా వెలుగులోకి వచ్చిన విద్యార్థుల హత్య దృశ్యాలు సంచలనంగా మారాయి. దాంతో ఒక్కసారిగా నిరసనలు పెల్లుబికాయి. రాజధాని నగరం ఇంఫాల్‌లో వందలాదిమంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆ దారుణాన్ని నిరసించారు.(Manipur Violence)

జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur Violence)లో అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న ఈ దారుణం ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తివేయడంతో వెలుగులోకి వచ్చింది. మృతులు మైతేయ్‌ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించారు. వారిని సాయుధులు కిడ్నాప్‌ చేసి, హత్య చేసినట్లుగా తెలుస్తోంది.  పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్‌ అయ్యింది. దీంతో ఈ ఘటన మరోసారి దుమారం రేపింది. ఇది తోటి విద్యార్థుల ఆగ్రహానికి దారితీసింది.

ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్‌.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి

దాంతో వందలాదిమంది విద్యార్థులు ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్(Chief Minister N Biren Singh) నివాసంవైపు దూసుకెళ్లేందుకు యత్నించగా.. భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌, స్మోక్‌ బాంబ్స్‌ను వాడాల్సి వచ్చింది. పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో 30 మంది గాయపడ్డారని, వారిలో ఎక్కువ మంది బాలికలే ఉన్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు.

జులై 6వ తేదీన ఆంక్షలు సడలించడంతో అమ్మాయి నీట్‌ కోచింగ్‌ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిస్థితులు సద్దుమణిగాయని భావించిన ఆమె.. తర్వాత తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి వారి జాడలేకుండా పోయింది. వారు ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్‌ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యిందని పోలీసులు అప్పట్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే సాయుధులు వారిని కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని