Omicron: కొన్ని యాంటీజెన్‌ పరీక్షలు ఒమిక్రాన్‌ను గుర్తించకపోవచ్చు: ఫౌచీ

ఇంటి వద్ద స్వయంగా నిర్వహించుకొనే కొన్నిరకాల యాంటీజెన్‌ పరీక్షలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించలేక పోవచ్చని అమెరికా అధ్యక్షుడి సలహాదారు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు.

Published : 17 Dec 2021 15:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంటి వద్ద స్వయంగా నిర్వహించుకునే కొన్నిరకాల యాంటీజెన్‌ పరీక్షలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించలేక పోవచ్చని అమెరికా అధ్యక్షుడి సలహాదారు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు పీసీఆర్‌ పరీక్షలే అత్యుత్తమమైనవని ఆయన పేర్కొన్నారు. ‘‘అమెరికాలో అందుబాటులో ఉన్న అన్ని రకాల యాంటీజెన్‌ పరీక్షలు ఒమిక్రాన్‌ విషయంలో కచ్చితమైన ఫలితాలను ఇవ్వడంలేదు. కొన్ని మాత్రం కచ్చితంగా గుర్తిస్తున్నాయి. ఈ యాంటీజెన్‌ పరీక్షల్లో కొన్ని ఒమిక్రాన్‌ను గుర్తించడానికి గల కారణలపై పరిశోధనలు చేస్తున్నాం’’ అని ఆయన  వివరించారు.

ర్యాపిడ్‌ పరీక్షలు ఒమిక్రాన్‌ను గుర్తించలేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఫౌచీ అన్నారు. తప్పుడు ఫలితాలు .. ప్రజల్లో తప్పుడు భరోసాను కల్పిస్తాయని, ఇది మరింత ఆందోళనకరమని వెల్లడించారు. కొన్ని వారాల్లోనే ఒమిక్రాన్‌ అమెరికాలో అత్యధికంగా వ్యాపిస్తున్న వేరియంట్‌గా మారిపోతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు చూసిన కరోనా వైరస్‌ల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని వెల్లడించారు. అర్హులైనవారు టీకాలు తీసుకోవాలని.. అవసరమైన వారు బూస్టర్‌ డోసులు వేయించుకోవాలని సూచించారు. ఇన్ఫెక్షన్‌ వ్యాపిస్తున్న వేగాన్ని చూస్తుంటే.. ఈ సారి శీతాకాలం కఠినంగా మారనుందని అర్థమవుతోందని ఆయన అంచనావేశారు. ప్రస్తుతం డెల్టాతో అమెరికా తీవ్రంగా పోరాడుతోందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని