Sonali Phogat: సోనాలి హత్యకు రూ.10 కోట్ల డీల్‌?.. కుటుంబీకులకు రహస్య లేఖలు

భాజపా నేత, నటి సోనాలి ఫొగాట్‌ను హత్య చేసేందుకు రూ.10 కోట్ల డీల్‌ జరిగిందని ఆమె కుటుంబీకులు ఆరోపించారు. ఇందుకు సంబంధించి రెండు లేఖలు అందాయని పేర్కొన్నారు.

Published : 10 Oct 2022 01:11 IST

దిల్లీ: భాజపా నేత, నటి సోనాలి ఫొగాట్‌ (42) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆమెది హత్యేనని కుటుంబీకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సోనాలి హత్యకు రూ.10 కోట్ల డీల్‌ జరిగిందని వారు తాజాగా ఆరోపించారు. ఈ హత్యకు సంబంధించి కొందరి నుంచి రెండు లేఖలు అందుకున్నట్లు నటి కుటుంబసభ్యుడు అమన్ పూనియా తెలిపారు. హత్య కోసం రూ.10 కోట్ల డీల్‌ జరిగిందంటూ ఓ లేఖలో పేర్కొనగా, ప్రముఖ రాజకీయ నేతల పేర్లు మరో లేఖలో ఉన్నాయన్నారు. ఈ లేఖల్లో ముఖ్యమైన సమాచారం ఉండటంతో వీటిపై దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గోవా పర్యటనకు వెళ్లిన సోనాలీ ఫోగాట్‌ ఆగస్టు నెలలో అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆమె మొదట గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. సోనాలి సహాయకులైన సుధీర్‌ సంగ్వాన్‌, సుఖ్వీందర్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో సోనాలీ మరణంపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు.. ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించారు. కాగా ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు