
పాలనలో ప్రజలే సర్వాధికారులు: సోనియా గాంధీ
ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ అధినేత్రి
దిల్లీ: దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా వేడుక అన్యాయంపై న్యాయం, అబద్ధంపై నిజం, అహంకారంపై వివేకం గెలుపునకు చిహ్నామని అన్నారు. నవరాత్రుల పూజల తర్వాత ఈ విజయదశమి నాడు ఏదైనా ఒక సంకల్పం తీసుకొని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలని హితువు పలికారు. దసరా పర్వదినం ప్రజల జీవితాల్లో సంతోషం నింపడమే కాదు.. సామరస్యత, సంప్రదాయ విలువలను బలోపేతం చేస్తుందని తెలిపారు.
‘‘ప్రభుత్వ పాలనలో ప్రజలే సర్వాధికారులు. నాయకుల జీవితంలో అహంకారానికి, అబద్ధాలకి, మాట తప్పడాలకు స్థానం లేదు. ఇదే విజయదశమి ఇచ్చే అతిపెద్ద సందేశం’’ అని సోనియా అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా వేడుకలను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ప్రజలకు ట్విటర్ వేదికగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. అంతిమంగా నిజమే విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.