Updated : 13 Aug 2022 14:38 IST

సోనియాకు మళ్లీ పాజిటివ్‌.. ఐసోలేషన్‌లో కాంగ్రెస్‌ అధినేత్రి

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌ (COVID-19) నిర్ధారణ అయ్యిందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. ప్రభుత్వ ప్రొటోకాల్‌ ప్రకారం ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నట్లు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. సోనియా గాంధీ కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం ఇటీవలే కొవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే.

సోనియా గాంధీ కొవిడ్‌ బారిన పడడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. జూన్‌లో ఆమెకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో కొవిడ్‌ అనంతర సమస్యలతో అదే నెల 12వ తేదీ దిల్లీలోని సర్‌గంగా రామ్‌ ఆస్పత్రిలో చేరారు. జూన్‌ 20న కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రెండు నెలలు తిరగకముందే మరోసారి కొవిడ్‌ బారిన పడడం గమనార్హం.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని