సారీ.. అవి కరోనా టీకాలు అని తెలియదు!

హరియాణాలోని జింద్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 1,700 వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లిన దొంగ వాటిని తిరిగిచ్చేశాడు. ఓవైపు కరోనా రెండో వేవ్‌ ఉద్ధృతి నేపథ్యంలో కరోనా టీకాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జింద్‌లోని ఆసుపత్రిలో వ్యాక్సిన్లు దొంగతనానికి గురికావడం కలకలం సృష్టించింది.

Updated : 24 Nov 2022 15:03 IST

ఎత్తుకెళ్లిన వ్యాక్సిన్లను తిరిగిచ్చేసిన దొంగ

ఛండీగఢ్‌‌: హరియాణాలోని జింద్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 1,700 వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లిన దొంగ వాటిని తిరిగిచ్చేశాడు. ఓవైపు కరోనా రెండో వేవ్‌ ఉద్ధృతి నేపథ్యంలో కరోనా టీకాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జింద్‌లోని ఆసుపత్రిలో వ్యాక్సిన్లు దొంగతనానికి గురికావడం కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే సదరు దొంగ జింద్‌లోని సివిల్‌ లైన్స్‌ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా టీ కొట్టులో ఉన్న ఓ వ్యక్తికి వ్యాక్సిన్ల పెట్టెను ఇచ్చాడు. తాను పోలీసులకు ఆహారం సరఫరా చేస్తున్నానని.. తనకు వేరే పనిఉండటంతో ఆ పెట్టెను పోలీసులకు ఇవ్వాలని చెప్పి దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

పోలీసులు ఆ పెట్టెను తెరవగా వారికి కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా డోసులతో పాటు ఓ ఉత్తరం కనిపించింది. హిందీలో ఉన్న ఆ ఉత్తరంలో.. ‘‘ క్షమించండి. ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు’’ అని రాశాడు. ప్రస్తుతం మార్కెట్‌లో కొరత ఉన్న కరోనా చికిత్సలో వాడే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లుగా భావించి వ్యాక్సిన్లను దొంగ ఎత్తుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని