South Central Railway: సరకు రవాణాలో దూసుకెళ్తున్న దక్షిణ మధ్య రైల్వే

సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే దూసుకెళ్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏటికేడూ

Published : 06 Sep 2021 23:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే దూసుకెళ్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏటికేడూ కొత్త విధానాలతో మెరుగైన ఫలితాలు రాబడుతోంది. కరోనా వేళ ప్రయాణికుల రవాణా వల్ల తగ్గిన ఆదాయాన్ని సరకు రవాణా రూపంలో చేకూర్చుకుంటోంది. తద్వారా దేశంలోనే అత్యధిక ఆదాయార్జన జోన్‌ పేరును నిలబెట్టుకుంటోంది.

కరోనా తెచ్చిన ప్రతికూల పరిస్థితుల వల్ల రైల్వే రంగంలో రాబడి గణనీయంగా తగ్గింది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ విధాలనపై దృష్టి సారించిన రైల్వే శాఖ సరుకు రవాణాను పెంచింది. నిత్యావసరాల రవాణాకోసం పలు ప్రాంతాల నుంచి అదనంగా గూడ్సు రైళ్లను ఏర్పాటు చేసింది. దక్షిణమధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాలకు సరుకు రవాణా రైళ్లను నడిపింది. రైళ్లకు రెండు ఇంజన్లు ఏర్పాటు చేసి   ఒకేసారి రెట్టింపు సరుకును చేరవేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకు రవాణా చేసింది. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దక్షిణ మధ్య రైల్వే అధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 

గతేడాది ఆగస్టులో జరిగిన సరుకు రవాణా లోడింగ్‌తో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 51 శాతం అధికంగా రవాణా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సిమెంట్‌ లోడింగ్‌ జరిగింది. బొగ్గు లోడింగ్‌లో 72 శాతం వృద్ధి నమోదయ్యింది. కంటైనర్‌ లోడింగ్‌లో 96 శాతం అభివృద్ధి నమోదు చేసింది. సరుకు రవాణా లోడింగ్‌లో వృద్ధి సాధించడం కోసం రైళ్లు స్థిరంగా గంటకు 50 కి.మీల సగటు వేగంతో నడిచాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని