Omicron: దక్షిణ కొరియాకు పాకిన ‘ఒమిక్రాన్‌’ 

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ‘ఒమిక్రాన్‌’ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు విస్తరించిన ఈ కొత్త వేరియంట్‌.. తాజాగా దక్షిణ కొరియాకూ పాకింది.......

Published : 01 Dec 2021 23:54 IST

సియోల్‌: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ‘ఒమిక్రాన్‌’ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు విస్తరించిన ఈ కొత్త వేరియంట్‌.. తాజాగా దక్షిణ కొరియాకూ పాకింది. దక్షిణ కొరియాలో కొత్తగా ఒకే రోజు ఐదు ఒమిక్రాన్‌ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. నైజీరియా నుంచి వచ్చిన వారిలో ఈ వేరియంట్‌ వెలుగుచూసింది. నవంబర్‌ 24న నైజీరియా నుంచి వచ్చిన ఇద్దరు దంపతులతో పాటు.. వారిని ఆహ్వానించి తన ఇంటికి తీసుకెళ్లిన బంధువులలో ఒమిక్రాన్‌ వెలుగు చూసినట్టు కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ వెల్లడించింది. అలాగే, అంతకముందు నైజీరియా వెళ్లి నవంబర్‌ 23న దక్షిణ కొరియాకు వచ్చిన ఇద్దరు మహిళల్లోనూ ఈ వైరస్‌ వెలుగుచూసినట్టు తెలిపింది.

డెల్టా వేరియంట్‌ కన్నా వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ని కట్టడి చేసేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం ఆదివారం నుంచే చర్యలను కట్టుదిట్టం చేసింది. దక్షిణాఫ్రికాతో పాటు మరో 7 దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించింది. అలాగే, ఆ దేశాల నుంచి వచ్చే దక్షిణ కొరియా పౌరులు వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని నిబంధనలు విధించింది.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని