Space X: 52 స్టార్ లింక్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఫాల్కన్ 9 రాకెట్‌

స్పేస్-ఎక్స్‌ అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్.. 52 స్టార్ లింక్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

Published : 19 Dec 2021 13:45 IST

వాషింగ్టన్‌: స్పేస్ఎక్స్‌ అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన ‘ఫాల్కన్-9’ రాకెట్.. 52 స్టార్ లింక్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది. కాలిఫోర్నియా నుంచి శనివారం ప్రయోగించిన ఈ రాకెట్.. 52 స్టార్ లింక్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లింది. రెండు దశలుగా సాగిన ఈ రాకెట్ ప్రయాణంలో తొలుత సముద్రంలోని స్పేస్-ఎక్స్ డ్రోన్ షిప్ మీదికి చేరుకొని.. రెండో దశలో ఉపగ్రహాలతో కక్ష్యలోకి దూసుకెళ్లినట్లు లాంచ్ కమాండర్ తెలిపారు. స్టార్ లింక్ అనేది ఉపగ్రహ ఆధారిత ‘గ్లోబల్ ఇంటర్నెట్’ విధానం కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు దూరంగా ఉన్న ప్రాంతాలను సైతం అనుసంధానం చేసేందుకు కొన్నేళ్లుగా స్పేస్ఎక్స్‌ పని చేస్తోంది.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని