వ్యాక్సిన్‌ పంపిణీ.. సవాలే..

భారత్‌ వంటి అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో వ్యాక్సిన్‌ను వేగంగా పంపిణీ చేయడం నిజమైన సవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Published : 05 Jan 2021 22:05 IST

తిరువనంతపురం: భారత్‌ వంటి అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో వ్యాక్సిన్‌ను వేగంగా పంపిణీ చేయడం నిజమైన సవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌కు చెందిన డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌, డాక్టర్‌ హంసధ్వని కుగనాథం భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీకి ఉన్న అడ్డంకుల గురించి విశ్లేషించారు. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీలో ఈ సమస్య నెలకొందని వారు వెల్లడించారు. వ్యాక్సిన్‌ను వేగంగా వీలైనంత వేగంగా ప్రజలందరికీ అందించడంలో అనేక సమస్యలు ఎదురవుతాయని వారు తెలిపారు. ఈ మేరకు ఒక ఆర్టికల్‌లో వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 45 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని తెలిపారు. మరో 156 వ్యాక్సిన్‌లు ప్రయోగదశల్లో ఉన్నాయన్నారు. 2021 ముగింపు కల్లా ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన వ్యాక్సిన్లను పంపిణీ చేయడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యమని తెలిపారు. ఆ తర్వాత దేశాల అవసరాన్ని బట్టి వ్యాక్సిన్లను అందిస్తామన్నారు. ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత త్వరగా వైరస్‌ వ్యాపించే ప్రమాదముందని తెలిపారు. కాగా కరోనా కారణంగా స్కూళ్లు తెరచుకోకపోవడం చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారు వెల్లడించారు. కరోనా కారణంగా ప్రజలు అనేక గుణపాఠాలు నేర్చుకున్నారని తెలిపారు. దీని కారణంగా వివిధ దేశాల్లోని ఆరోగ్య భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి..

భారత్‌లో 71కు చేరిన యూకే కరోనా కేసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని