‘ఆ రెండూ ఉచితాలు కావు.. ఇంతకుమించి మాట్లాడను’: స్టాలిన్‌

stalin-dmk ఉచితాలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Updated : 13 Aug 2022 18:26 IST

చెన్నై: ఉచితాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. ప్రధాని మోదీ ఈ అంశాన్ని లేవనెత్తిన రోజే.. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. విద్య, వైద్యంపై చేసే ఖర్చు ఎంతమాత్రం ‘ఉచితాలు’ కావని వ్యాఖ్యానించారు. పేదలకు మేలు చేసేందుకే ఈ పథకాలని పేర్కొన్నారు. ఇంతకుమించి మాట్లాడితే రాజకీయం అవుతుందని పేర్కొన్నారు.

ఉచిత పథకాలు దేశానికి ఏమాత్రం మంచిది కాదంటూ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తంచేసింది. అయితే, ఉచితాలకు, సంక్షేమ పథకాలకు తేడా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘విద్య, వైద్యంపై చేసే ఖర్చు ఏమాత్రం ఉచితాలు కావు. చదువు అనేది జ్ఞానానికి సంబంధించినది. వైద్యం అనేది ఆరోగ్య సంరక్షణకు సంబంధించింది. అందుకే ఈ రెండు రంగాల్లోనూ తగినన్ని సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటోంది. ఇవి ఏమాత్రం ఉచితాలు కావు.. సంక్షేమ పథకాలు. ఈ మధ్య ఉచితాలు ఉండకూడదన్న సలహా ఇస్తూ కొంతమంది వ్యక్తులు కొత్తగా పుట్టుకొచ్చారు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే అది రాజకీయమే అవుతుంది. కాబట్టి నేను మాట్లాడను’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని