Published : 05 Jul 2022 20:21 IST

Spice Jet flight: ఒకే రోజు రెండు ఘటనలు.. మరో స్పైస్‌జెట్‌ విమానం దించివేత!

ముంబయి: ప్రైవేటు రంగ ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు (Spice Jet) చెందిన మరో విమానంలో సమస్య తలెత్తింది. విండ్‌ షీల్డ్‌కు పగుళ్లు రావడంతో సదరు విమానానికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చి ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమమని ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

గుజరాత్‌లోని కాండ్ల నుంచి ముంబయికి బయల్దేరిన SG-3324 విమానం మధ్యాహ్నం 2.50 గంటలకు ముంబయి చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కో పైలట్‌ వైపు విండ్‌ షీల్డ్‌కు పగుళ్లు రావడంతో ముంబయిలో ప్రాధాన్యతినిచ్చి దించివేసినట్లు స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి తెలిపారు. అంతకుముందు దుబాయ్‌ వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీలో అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఒకే రోజు ఒకే కంపెనీకి చెందిన రెండు విమానాల్లో ఇలా జరగడం పట్ల ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

Also Read: స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతికలోపం.. కరాచీలో అత్యవసర ల్యాండింగ్‌

ఇటీవల స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం దిల్లీ నుంచి మధ్యప్రదేశ్ బయల్దేరిన ఓ స్పైస్‌జెట్‌ విమానం క్యాబిన్‌లో పొగలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే తిరిగి దిల్లీ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. గత నెల 19న దిల్లీకి బయల్దేరిన ఓ విమానం ఇంజిన్‌లోనూ మంటలు రావడంతో దాన్ని అత్యవసరంగా పట్నాలో దించేశారు. వరుస ఘటనలతో స్పైస్‌జెట్‌ ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. కేవలం మూడు వారాల వ్యవధిలో ఇది ఏడో ఘటన కావడం గమనార్హం.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని