SpiceJet: టేకాఫ్‌ సమయంలో స్తంభాన్ని ఢీకొన్న స్పైస్‌జెట్‌ విమానం

స్పైస్‌జెట్‌ విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. టేకాఫ్‌కు వెళ్లే క్రమంలో విమానం అక్కడి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది.......

Published : 28 Mar 2022 16:18 IST

దిల్లీ: స్పైస్‌జెట్‌ విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. టేకాఫ్‌కు వెళ్లే క్రమంలో విమానం అక్కడి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం స్వల్పంగా ధ్వంసమైంది. ఈ ఘటన సోమవారం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. బోయింగ్ 737-800 విమానం ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత ప్యాసింజర్ టెర్మినల్ నుండి రన్‌వేకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూకి వెళ్లేందుకు సిద్ధమైన ఈ విమానం ప్రమాదానికి గురికావడంతో దాని కుడి రెక్క స్పల్పంగా ధ్వంసమైంది. దీంతో ఐలెరాన్ దెబ్బతింది. ఆ స్తంభం కూడా విరిగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులను మరో విమానంలో తరలించినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని