Anurag Thakur: స్కిప్పింగ్‌ చేసిన క్రీడల మంత్రి.. వీడియో చూడండి!

‘ఫిట్‌ ఇండియా’ యాప్‌ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కిప్పింగ్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Updated : 29 Aug 2021 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా జరుపుకొనే జాతీయ క్రీడల దినోత్సవం రోజున ‘ఫిట్‌ ఇండియా’ యాప్‌ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కిప్పింగ్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీ ఫిట్‌నెస్‌ లెవల్‌ ఎంత? రండి..స్కిప్పింగ్‌ ఆడండి’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘దేశవ్యాప్తంగా ఫిట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 29 ఆగస్టు 2019లో ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత ఇదే రోజున ఫిట్‌ ఇండియా మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చాం. ఇది రోజువారీగా నిద్ర పోయే సమయాన్ని, ఎంత నీరు తీసుకుంటున్నామని పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. మనం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి ఇది మార్గనిర్దేశం చేస్తుంది’ అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కాగా, గడచిన రెండేళ్లలో ఫిట్‌ ఇండియా ఉద్యమం లక్షల మంది జనాభాను చేరుకుంది. దేశవ్యాప్తంగా స్కూల్‌ వీక్‌, ఫిట్‌ ఇండియా ఫ్రీడం రన్‌, ఫిట్‌ ఇండియా సైక్లోథాన్ లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని