TamilNadu: శ్రీలంక నేవీ కస్టడీలో 22 మంది భారత మత్య్సకారులు

తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులను ఆదివారం శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. 

Published : 23 Jun 2024 23:40 IST

చెన్నై: తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులను ఆదివారం శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. నేదున్‌తీవు సరిహద్దులోని పాక్‌బే సముద్ర ప్రాంతంలో చేపలు పడుతుండగా ఆదివారం ఉదయం వారిని అదుపులోకి తీసుకొని, మూడు బోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు రామేశ్వరం ఫిషర్‌మెన్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారమే వీళ్లంతా వేటకు సముద్రంలోకి వెళ్లినట్లు పేర్కొంది.

చేపలవేటకు వెళ్లిన తమిళనాడు జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేయడం ఇటీవల ఎక్కువైంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు జూన్‌ 19న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ లేఖ రాశారు. అరెస్టయిన మత్స్యకారులను, చేపల బోట్లను తక్షణమే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కొట్టాయిపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి వేటకు వెళ్లిన నలుగురిని శ్రీలంక నేవీ అరెస్టు చేసినట్లు లేఖలో ప్రస్తావించారు. ఏప్రిల్‌ నెలలో తమిళనాడుకు చెందిన మొత్తం 19 మంది మత్స్సకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. కొలంబో నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో వారిని చెన్నైకి పంపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని