Updated : 13 May 2022 12:12 IST

Sri lanka: ప్రజాగ్రహం నేపథ్యంలో రూ.750కోట్ల ఉపశమనం ప్రకటించిన శ్రీలంక ప్రభుత్వం

కొలంబో: ఆహార, ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలకు ఆ దేశ ప్రభుత్వం నిత్యావసర ఆహారం, వైద్య సంబంధిత మందులపై పన్నురాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.దేశ ప్రజలకు రూ.750కోట్ల విలువైన ఆర్థిక ఉపశమన ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు దేశ ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్స ప్రకటించారు. శ్రీలంక ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ధరల పెరుగుదల కారణంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఒక బిలియన్‌ (రూ.750కోట్లు) ప్యాకేజీని ఆర్థిక మంత్రి ఆవిష్కరించారు. విదేశీ మారక ద్రవ్య నియంత్రణతో అత్యవసర వస్తువులను కూడా విదేశాల నుంచి కొనుగోలు చేయలేని స్థితిలో శ్రీలంక ప్రభుత్వం ఉంది. శ్రీలంక త్వరలో దివాలా తీసే స్థాయిని అందుకునే అవకాశం ఉన్నట్లు పలు అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు వెల్లడించాయి. దీంతో సామాన్య ప్రజల నుంచి తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో ప్రజలకు లబ్ధి కలిగేలా రూ.750 కోట్ల విలువైన ఆర్థిక ఉపశమన పథకాలను శ్రీలంక ఆర్థిక మంత్రి ప్రకటించారు. శ్రీలంకలో అత్యవసరమైన ఆహారం, మందులకు సంబంధించిన పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కోటిన్నరకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు,  భద్రతా దళాలు, పింఛన్‌ దారులకు నెలకు అదనంగా రూ.5వేల ప్రత్యేక నగదు సాయం అందించనున్నట్లు తెలిపారు. తోటల్లో పనిచేసే కార్మికులకు నెలకు 15 కిలోలు ఉచిత గోధుమలు, చిన్నకారు రైతులకు రూ.10వేల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. విదేశీ రుణాలను తిరిగి చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు, రుణ సమస్యల నుంచి శ్రీలంక కోలుకుంటుందని బ్రస్సెల్‌ ధీమా వ్యక్తం చేశారు. రుణ సమస్యల నుంచి కోలుకునేలా సాయం చేయాలని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సాయం కోరబోమని ఆర్థికమంత్రి తెలిపారు. చైనా, భారత్‌, జపాన్‌ దేశాలకు అధిక స్థాయిలో రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉందని ఈ వ్యవహారంపై ఆ దేశాలతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఉపశమనం శ్రీలంక ఆర్థిక స్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నియంత్రణకు ఏమాత్రం దోహదపడదని విమర్శకులు పేర్కొంటున్నారు.

 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts