Ayodhya Ram Temple: అయోధ్య ఆలయ నిర్మాణంలో డిజైన్ సమస్యలు లేవు: నృపేంద్ర మిశ్ర

అయోధ్య రామమందిర (Ayodhya Ram Temple) నిర్మాణంలో ఎలాంటి డిజైన్ సమస్యలు లేవని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర వెల్లడించారు. 

Updated : 25 Jun 2024 18:00 IST

అయోధ్య: అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు.. ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర స్పందించారు. లీకేజీ నిజమేనని అంగీకరించిన ఆయన..దీనికి డిజైన్ సమస్యలు కారణం కాదని వెల్లడించారు. ‘‘ప్రస్తుతం నేను అయోధ్యలోనే ఉన్నాను. మొదటి అంతస్తు నుంచి వర్షం నీరు కారడాన్ని  చూశాను. గురుమండపం నుంచి ఆకాశం కనిపిస్తుంది. శిఖర నిర్మాణం పూర్తయితే అది కవర్ అవుతుంది. ప్రస్తుతం మొదటి అంతస్తు నిర్మాణ పనుల్లో పురోగతి ఉంది. ఒకసారి ఆ పనులు పూర్తయితే అక్కడి పైపులు అన్ని మూసివేస్తాం. అలాగే గర్భగుడిలో ఎలాంటి డ్రైనేజీ తరహా నిర్మాణం లేదు’’ అని వెల్లడించారు. మొత్తం ఆలయ నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు.

శనివారం రాత్రి భారీ వర్షం పడటంతో లీకేజీ సమస్య బయటపడిందని, నీరు సరిగ్గా రామ్‌లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే, వీఐపీలు దర్శనం చేసుకునే చోట కారుతోందని సత్యేంద్రదాస్‌ పేర్కొన్నారు.ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకూ సరైన ఏర్పాట్లు లేవని.. ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఏడాది జనవరి 22న రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని