MK Stalin: ఇదే తమిళ ‘రాష్ట్ర గీతం’.. ప్రకటించిన సీఎం స్టాలిన్‌

తమిళనాడు రాష్ట్ర గీతంగా ‘తమిళ్ థాయ్ వాళ్తూ’ను శుక్రవారం ఆ రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Updated : 17 Dec 2021 20:45 IST

చెన్నై: తమిళనాడు రాష్ట్ర గీతంగా ‘తమిళ్ థాయ్ వాళ్తూ’ను శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇకపై విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ రాష్ట్ర గీతాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించింది. రాష్ట్ర గీతం వినిపించేటప్పుడు దివ్యాంగులు తప్ప మిగతా వారంతా లేచి నిలబడాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది. కాగా ఇటీవలి కాలంలో ‘తమిళ్ థాయ్ వాళ్తూ’ గీతం వార్తల్లో నిలిచింది. ‘తమిళ్ థాయ్ వాళ్తూ’ కేవలం ఓ పాట మాత్రమేనని, ఏ కార్యక్రమంలోనూ ఎవరూ లేచి నిలబడాల్సిన అవసరం లేదని పేర్కొంటూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది ఐఐటీ-మద్రాస్‌ స్నాతకోత్సవంలో ఆ పాటను ప్లే చేయలేదు. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌కి లేఖ రాయగా.. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘రాష్ట్ర గీతం’గా ప్రకటించి.. అందరూ లేచి నిలబడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.  విద్యావేత్త మనోన్మణియం సుందరనార్ ఈ గేయానికి సాహిత్యమందించగా.. ఎం.ఎస్‌ విశ్వనాథన్‌ సంగీతమందించారు. గేయం నిడివి 55 సెకన్లు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని