Tamil Nadu: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళల మృతి

ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట జరిగి మహిళలు మృతిచెందిన విషాద ఘటన తమిళనాడు (Tamil Nadu)లో చోటుచేసుకుంది.

Updated : 04 Feb 2023 19:13 IST

చెన్నై: తమిళనాడు (Tamil Nadu)లోని తిరుపత్తూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉచిత చీరల పంపిణీ (Saree Distribution) కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు.

తిరుపత్తూరు (Tirupattur) జిల్లాలోని వాణియంబాడి ప్రాంతంలో మురుగన్‌ తైపూసం (Thaipusam) ఉత్సవాలను పురస్కరించుకుని ఓ ప్రైవేటు కంపెనీ ఉచితంగా ధోతీలు, చీరలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం నేడు టోకెన్లు జారీ చేయగా.. వీటిని తీసుకునేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట (stampede) జరిగి కొందరు మహిళలు కిందపడిపోయారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని