COVID-19 vaccine: సెప్టెంబర్‌ 5లోపు టీచర్లకు టీకాలు ఇవ్వండి..!

సెప్టెంబర్‌ 5వ తేదీలోపు అన్ని రాష్ట్రాల్లోని పాఠశాల టీచర్లకు టీకాలు ఇవ్వాలని నేడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కోరారు. ఇందు కోసం రాష్ట్రాలకు అదనంగా రెండు కోట్ల టీకాలను

Published : 25 Aug 2021 15:57 IST

రాష్ట్రాలకు సూచించిన కేంద్రం

ఇంటర్నెట్‌డెస్క్‌: సెప్టెంబర్‌ 5వ తేదీలోపు అన్ని రాష్ట్రాల్లోని పాఠశాల టీచర్లకు టీకాలు ఇవ్వాలని నేడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కోరారు. ఇందు కోసం రాష్ట్రాలకు అదనంగా రెండు కోట్ల టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. టీకాల కార్యక్రమంలో వారికి ప్రాధాన్యమిచ్చి టీచర్స్‌ డే కంటే ముందే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ‘‘ప్రస్తుతం ప్రతి రాష్ట్రానికి మరిన్ని డోసులు అందుబాటులో ఉంచేందుకు అదనంగా 2 కోట్ల టీకాలను తీసుకొచ్చాం. సెప్టెంబర్‌ 5వ తేదీ నాటికి టీచర్లందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్రాలను కోరుతున్నాను’’ అని ఆయన ట్వీట్‌ చశారు.

గతేడాది మార్చిలో దేశ వ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించారు. గత అక్టోబర్‌ తర్వాత కొవిడ్‌ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలను తెరిచాయి. కానీ, సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో మళ్లీ మూసివేశారు. తాజాగా మరోసారి వివిధ రాష్ట్రాలు పాఠశాలలను తెరిచే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కానీ, చాలా చోట్ల సిబ్బందికి టీకాలు ఇవ్వకపోవడంతో కొవిడ్‌ ప్రబలే ముప్పు తలెత్తింది. ఈ నేపథ్యంలో కేంద్రం అదనపు డోసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని