Vaccine: రాష్ట్రాల వద్ద ఇంకా ఎన్ని డోసులున్నాయ్‌?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటంలో వ్యాక్సినే కీలక అస్త్రం. కరోనా సెకండ్‌ వేవ్‌తో సతమతమవుతున్న భారత్‌కు మూడో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ ......

Published : 06 Jun 2021 01:10 IST

దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటంలో వ్యాక్సినే కీలక అస్త్రం. కరోనా సెకండ్‌ వేవ్‌తో సతమతమవుతున్న భారత్‌కు మూడో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసేలా ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 36,50,080 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. మరోవైపు, దేశంలో ఇప్పటివరకు 22,78,60,317 టీకా డోసులు పంపిణీ జరగ్గా.. ఇంకా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.65కోట్ల మేర డోసులు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. అలాగే, రాష్ట్రాలకు ఇప్పటివరకు 24కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను సమకూర్చినట్టు (రాష్ట్రాలు నేరుగా సేకరించుకున్నవాటితో కలిపి) వివరించింది. వీటిలో శనివారం ఉదయం 8గంటల వరకు దేశవ్యాప్తంగా 22,65,08,508 డోసులు వినియోగించినట్టు (వృథాతో కలిపి) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇంకా 1,65,00,572 డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18,19,52,338 మంది తొలిడోసు వేయించుకోగా.. 4,59,07,979 మందికి రెండో డోసు కూడా పూర్తయింది. వీరిలో 99,45,863మంది ఆరోగ్య కార్యకర్తలు తొలి డోసు వేసుకోగా.. 68,41,480మందికి రెండో డోసు పూర్తయింది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల విషయానికి వస్తే.. 1,60,57,349మంది తొలి టీకా డోసు అందుకోగా..  86,38,798మంది రెండో డోసు వేయించుకున్నారు. ఇకపోతే, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో 6,97,94,194మంది తొలిడోసు వేయించుకోగా.. 1,11,93,705మంది రెండో డోసు తీసుకున్నారు. 60ఏళ్లు పైబడిన వారి విషయానికి వస్తే.. 6,01,85,472 మందికి తొలిడోసు వేయగా..1,90,14,859మందికి రెండో డోసు పూర్తయింది. 18 నుంచి 44ఏళ్ల వయసువారిలో 2,59,69,460మంది తొలి డోసు; 1,19,137మంది రెండో డోసు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని