Bogus Ration cards: 4.28 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డులు రద్దు‌‌: కేంద్రం

దేశంలో 2014-2021 మధ్య కాలంలో 4.28కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రద్దు చేశాయని కేంద్ర ప్రభుత్వం ........

Published : 04 Feb 2022 23:36 IST

దిల్లీ: దేశంలో 2014-2021 మధ్య కాలంలో 4.28 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రద్దు చేశాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆహార చట్టం ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

జాతీయ ఆహార భద్రతాచట్టం ప్రకారం.. రేషన్‌ కార్డులకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, రేషన్‌ కార్డుల జారీ, రేషన్‌ దుకాణాల ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్రాలే నిర్వహిస్తాయని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అర్హతలేని, నకిలీ లేదా బోగస్‌ కార్డుల్ని తొలగించేందుకు ఎప్పటికప్పుడు రాష్ట్రాలు రేషన్‌ కార్డుదారులను జాబితాను సమీక్షిస్తుంచి అనర్హులను తొలగిస్తుంటాయని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలు వెల్లడించిన వివరాల ప్రకారం 2014 నుంచి 2021వరకు 4.28 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డులు రద్దయినట్టు ప్రకటించారు.

యూపీలో అత్యధికంగా 1,70,75,301 కార్డులు రద్దు కాగా.. మహారాష్ట్రలో 41,65,552; పశ్చిమబెంగాల్‌ 41,09,873; మధ్యప్రదస్త్రశ్‌ 23,53,760; రాజస్థాన్‌  22,66,485; కర్ణాటక 21,54,193; తెలంగాణ 18,73,325; ఆంధ్రప్రదేశ్‌ 12,21,283; ఛత్తీస్‌గఢ్‌ 13,57,677 బోగస్‌ రేషన్‌ కార్డులను రద్దు చేశాయని చౌబే వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని