Vande Bharat: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. బిహార్‌లో అపరిచిత వ్యక్తులు రాళ్లు విసరడంతో కిటికీ అద్దం ధ్వంసమైంది.
దిల్లీ: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలుపై రాళ్ల దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బిహార్‌లోని కతిహార్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో రైలు అద్దం పగిలింది. ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు.
న్యూజల్పాయ్‌గురి నుంచి శుక్రవారం సాయంత్రం 3 గంటలకు వందే భారత్ రైలు ప్రారంభమైంది. సాయంత్రం 4.25 గంటల సమయంలో బిహార్‌లోని డకోలా- టెల్టా స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీ6 కోచ్‌లో ఓ అద్దం పగిలింది. ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదేని రైల్వే అధికారులు తెలిపారు. డకోలా రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైల్వే శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. డిసెంబర్ 30న ఈ రైలు ప్రారంభం కాగా.. రెండ్రోజులకే వరుసగా రెండు వరుస రాళ్ల దాడి ఘటనలు జరిగాయి. తాజాగా ఇది మూడోది. ఇటీవల సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ రైలుపై ప్రారంభానికి ముందే విశాఖలో కూడా ఆకతాయిలు రాళ్లు రువ్వారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
father characters: తండ్రులుగా జీవించి.. ప్రేక్షకుల మదిలో నిలిచి!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Ponguleti: విజయనగరం సీనరేజి టెండరూ ‘పొంగులేటి’ సంస్థకే
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం
-
Ap-top-news News
ACB Court: లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు