కమలా హారిస్‌ ఇమేజ్‌ను వాడుకోవటం ఆపండి..

కమలా హారిస్‌ సమీప బంధువు మీనా హారిస్‌పై ఆరోపణలు వస్తున్నాయి.

Updated : 15 Feb 2021 11:45 IST

మీనా హారిస్‌కు శ్వేతసౌధం హితవు..?

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పరపతిని ఆమె సమీప బంధువు మీనా హారిస్‌ వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకొనేందుకు వాడుకోవడంపై శ్వేతసౌధం అభ్యంతరం తెలిపినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. కమలా అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా మీనా ధోరణి మారకుంటే.. ఇటువంటి సున్నితమైన అంశాలే బైడెన్‌-హారిస్‌ ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

36 సంవత్సరాల మీనా హారిస్‌, కమలా హారిస్‌ సోదరి కుమార్తె. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈమె కమలా హారిస్‌ తరపున విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎనిమిది లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. న్యాయవాది అయిన మీనా.. ‘‘కమలా అండ్‌ మాయాస్‌ బిగ్‌ ఐడియా’’ తదితర పుస్తకాలు కూడా రాశారు. ఈమె ‘ఫినామినల్‌’ అనే వస్త్రాల బ్రాండ్‌కు వ్యవస్థాపకురాలు కూడా. ఐతే తమ బ్రాండ్‌ వస్త్రాలపై ‘వైస్‌ ప్రెసిడెంట్‌ ఆంటీ’ అంటూ  ముద్రించడం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రైవేటు విమానంలో ప్రయాణించటం వంటి చర్యలు విమర్శలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో మీనా కార్యకలాపాల్లో వైస్‌ ప్రెసిడెంట్‌ పేరును ఉపయోగించవద్దని.. వైట్‌ హౌస్‌‌కు చెందిన న్యాయవాదులు మీనా హారిస్‌కు హితవు పలికారు. అంతేకాకుండా ఉపాధ్యక్షురాలి బంధువుగా ఆమె పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా వివరించినట్లు తెలిసింది.
కాగా, ఎన్నికల ప్రచారం నాటి నుంచి అన్ని న్యాయపరమైన, నైతికపరమైన నియమాలను తాను అనుసరిస్తున్నానని మీనా హారిస్‌  స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఉపాధ్యక్షురాలికి సంబంధించినవి, ఆమెను పోలిన చిహ్నాలను, పేర్లను తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగించినట్లు కూడా ఆమె వివరించారు. ఇకపై కూడా కమలా హారిస్‌ పేరును తమ వస్తువుల ప్రచారంలోకి వాడబోమని ఆమె స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

బైడెన్‌ బృందంలోకి మరో ఇద్దరు

ఐరాస్‌ చీఫ్‌: అభ్యర్థిగా భారత సంతతి మహిళ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని