ఆ 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేశాం: సుప్రీంకు వెల్లడించిన పతంజలి సంస్థ

లైసెన్స్‌ రద్దు అయిన 14 ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశామని సుప్రీంకోర్టుకు పతంజలి సంస్థ వెల్లడించింది.

Published : 09 Jul 2024 14:48 IST

దిల్లీ: తయారీ లైసెన్స్‌ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి ఆయుర్వేద (Patanjali Ayurved) సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న తమ ఫ్రాంచైజీ స్టోర్లకు సూచించామని తెలిపింది. అలాగే వాటికి సంబంధించిన ప్రకటనలను ఉపసంహరించుకోవాలని మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద (Patanjali Ayurved) సంస్థ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటోంది. దానిలోభాగంగా తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధరణ అయిన నేపథ్యంలో పతంజలిపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఆయుర్వేద సంస్థ నుంచి స్పందన వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని