మళ్లీ ఎగిరిన ‘మహా విమానం’

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ‘స్ట్రాటోలాంచ్‌’ ఎయిర్‌క్రాఫ్ట్‌ రెండేళ్ల తర్వాత మరోసారి గాల్లోకి విజయవంతంగా ఎగిరింది. 6 ఇంజిన్లు, 28 చక్రాలతోపాటు 385 పొడవు రెక్కలున్న ఈ విమానం కాలిఫోర్నియాలోని మొజావే ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ పోర్ట్‌ నుంచి....

Published : 01 May 2021 01:11 IST

కాలిఫోర్నియా: ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ‘స్ట్రాటోలాంచ్‌’ ఎయిర్‌క్రాఫ్ట్‌ రెండేళ్ల తర్వాత మరోసారి విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. 6 ఇంజిన్లు, 28 చక్రాలతోపాటు 385 పొడవు రెక్కలున్న ఈ విమానం కాలిఫోర్నియాలోని మొజావే ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ పోర్ట్‌ నుంచి ఎడారి మీదుగా ప్రయాణం మొదలుపెట్టింది. రెండేళ్ల తర్వాత ఈ విమానం మరోసారి ఆకాశంలో విహరించగా.. ఈసారి దాని యాజమాన్యంతోపాటు అవసరాలు కూడా మారాయి. గాల్లోకి ఎగిరిన దాదాపు మూడు గంటల తర్వాత తిరిగి ల్యాండ్‌ అయినట్లు స్ట్రాటోలాంచ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

స్ట్రాటోలాంచ్‌ విమానాన్ని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ జి అలెన్‌ అభివృద్ధి చేశారు. 2019లో తొలిసారి ఈ విమానం గాల్లోకి ఎగరగా దానికి కొద్ది నెలల ముందే అలెన్‌ మృతిచెందారు. ఈ విమానాన్ని రోదసీ సేవల కోసం వినియోగించాలన్నది ఆయన ఆశయం. ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్లను రోదసీ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి వాటిని ప్రయోగించాలన్నది ఆయన ఆలోచన. అయితే, ప్రస్తుత యాజమాన్యం స్ట్రాటోలాంచ్‌లో మాత్రం అందుకు కొన్ని మార్పులు చేసింది. పునర్వినియోగ హైపర్‌ సోనిక్‌ విమానాలను లాంచ్‌ చేయడానికి దీనిని ఉపయోగించాలని భావిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని