Viral post: హార్ట్‌ హౌస్‌ఫుల్‌.. హృదయం నిండా అమ్మాయిలే..

ఓ విద్యార్థి పరీక్షల్లో రాసిన జవాబును చూసి అవాక్కవడం టీచర్‌ వంతైంది. దీనికి సంబంధించిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 21 Jun 2024 13:55 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: పరీక్షల్లో ఒక్కోసారి విద్యార్థులు సమాధానాలకు బదులు సినిమా స్టోరీలు, పాటలు రాయడం చూస్తూ ఉంటాం. కాని తాజాగా ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్‌ షాక్‌ అయ్యారు. గుండె(heart) బొమ్మ వేసి, దాని పనితీరును రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను చక్కగా వేశాడు. కాని అందులోని నాలుగు గదులను ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు. అందులోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాయడమే కాదు గుండె పనితీరు స్థానంలో ఆ అమ్మాయిలు చేసే పనులను వివరించాడు. 

ప్రియ తనతో ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నాడని రాశాడు. స్నాప్‌చాట్‌(Snapchat)లో తనతో టచ్‌లో ఉండే రూపకు అందంలో ఎవరూ సాటి రారని ఆమెను ప్రశంసించాడు. పొరుగింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా తన క్లాస్‌మేట్‌ హరితను సైతం ఇష్టపడుతున్నానని పేర్కొన్నాడు. 

ఆ సమాధానం చదివిన టీచర్‌ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ‘స్టూడెంట్‌ రాక్‌.. టీచర్ షాక్‌’ అంటూ ఓ నెటిజన్‌ స్పందించారు. ‘గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇవ్వచ్చు కదా’ అంటూ మరో నెటిజన్‌ స్పందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని