Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్‌ కామెంట్‌కు నవ్వులే నవ్వులు

చండీగఢ్‌ యూనివర్సిటీ (Chandigarh University) నిర్వహించిన పరీక్షలో ఓ విద్యార్థి రాసిన సమాధానాలు నవ్వు తెప్పించగా.. సమాధాన పత్రాలు దిద్దిన లెక్చరర్‌ కామెంట్స్‌ అంతకుమించి ఉన్నాయి.

Updated : 01 Apr 2023 04:13 IST

ఇంటర్నెట్‌డెస్క్: పరీక్షా సమయంలో ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రానప్పుడు.. కొందరు విద్యార్థులు వచ్చిన సమాధానాన్ని రాస్తారు. కొంచెం మార్కులైనా వేస్తారేమోనన్న ఉద్యేశంతో ఇంకొందరు ఇచ్చిన ప్రశ్నకు దగ్గరగా ఉన్న సమాధానాన్ని రాస్తారు. కానీ, చండీగఢ్‌ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి రాసిన సమాధానాలు నవ్వు తెప్పిస్తుంటే.. జవాబు పత్రాన్ని దిద్దిన లెక్చరర్‌ ఇచ్చిన కామెంట్స్‌ అంతకు మించి ఉన్నాయి.

యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో ఓ విద్యార్థి మూడు ప్రశ్నలకు సమాధానాలు రాశాడు. తొలి సమాధానంగా త్రీ ఇడియట్స్‌ సినిమాలోని ఓ పాటను రాశాడు. రెండో సమాధానంగా పేపర్‌ దిద్దిన వారిని పొగుడుతూ రాసుకొచ్చాడు. ‘‘ మేడమ్‌ మీరు చాలా తెలివైన టీచర్‌. నేను హార్డ్‌ వర్క్‌ చెయ్యలేకపోయాను. అది నా తప్పే. కానీ, దేవుడు నాకు కొంత టాలెంట్‌ ఇచ్చాడు’’ అంటూ రాసుకొచ్చాడు. మూడో ప్రశ్నకు సమాధానంగా పీకే సినిమాలోని ‘భగవాన్‌ హై కహాన్‌ రే తూ’’ అంటూ మరో పాటను అందుకున్నాడు. దీంతో కంగుతున్న లెక్చరర్‌.. అంతే వెటకారంగా మీరు మరిన్ని సమాధానాలు రాయాలి (పాటలు) అంటూ జవాబు పత్రంపై తన వ్యాఖ్య జోడించారు. ‘‘ మీ ఆలోచన బాగుంది. కానీ, ఇక్కడ ఇలాంటివి వర్కవుట్‌ కావు’’ అని కామెంట్‌ రాశారు. ఎందుకంటే అన్ని ప్రశ్నలకు  ఆ విద్యార్థి ఈ మూడు సమాధానాలే రాశాడట. ప్రస్తుతం ఆ జవాబు పత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని