Corona: ఆఫ్‌లైన్‌ పరీక్షలు మాకొద్దు.. మహారాష్ట్రలో విద్యార్థుల నిరసన

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆఫ్‌లైన్‌ పరీక్షలు రద్దు చేయాలని మహారాష్ట్రలోని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 10నుంచి 12వ తరగతుల విద్యార్థులకు......

Updated : 31 Jan 2022 20:27 IST

మంత్రి ఇంటి వైపు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

ముంబయి: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆఫ్‌లైన్‌ పరీక్షలు రద్దు చేయాలని మహారాష్ట్రలోని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 10నుంచి 12వ తరగతుల విద్యార్థులకు ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించాలన్న  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ మేరకు మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ ఇంటి వద్ద వందలాది మంది విద్యార్థులు నిరసన వ్యక్తంచేశారు.  కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న వేళ ఆఫ్‌లైన్‌ పరీక్షలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ధారవిలోని అశోక్‌ మిల్‌ నాకా నుంచి విద్యార్థులు మంత్రి ఇంటి వైపు వెళ్తుండగా.. పోలీసులు రంగంలోకి వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీఛార్జి చేశారు. ఠాణె, నాసిక్‌ వంటి మెట్రో పాలిటన్‌ నగరాల నుంచి విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం తెలుసుకొని ముంబయికి చేరుకున్నారని పోలీసులు వెల్లడించారు. నిరసనకు అనుమతులు తీసుకోలేదన్నారు. లాఠీఛార్జిలో ఎవరూ గాయపడలేదనీ.. కొందరు విద్యార్థుల్ని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆ తర్వాత విడుదల చేసినట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని