‘స్పుత్నిక్‌ వి’ టీకా అనుమతులపై నేడు భేటీ

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో వైరస్‌ను తరిమికొట్టే వ్యాక్సిన్ల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉండగా.

Published : 12 Apr 2021 11:15 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో వైరస్‌ను తరిమికొట్టే వ్యాక్సిన్ల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉండగా.. మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌ వి’ టీకాకు భారత్‌లో అత్యవసర వినియోగంపై కేంద్ర నిపుణుల కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నిపుణుల కమిటీ అంగీకరిస్తే కొద్ది రోజుల్లోనే దేశంలో ఈ టీకా ఉత్పత్తి, వినియోగానికి కేంద్రం నుంచి అనుమతులు లభించే అవకాశాలున్నాయి. 

రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘స్పుత్నిక్‌ వి’ టీకాపై మనదేశంలో రెండు, మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ఇటీవలే ఆ సంస్థ నిర్వహించింది. ఆ పరీక్షల భద్రత, ఇమ్యునోజెనిసిటీ సమాచారాన్ని ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలికి అందజేసిన డాక్టర్‌ రెడ్డీస్‌‌.. టీకా ఉత్పత్తి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకుంది. ఈ డేటాను కేంద్ర నిపుణుల బృందం నేడు విశ్లేషించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని