గతంలోనూ ఇలాంటి భేటీలు జరిగాయ్‌.. కేసీఆర్‌ నన్నూ కలిశారు: ఫడణవీస్‌

భాజపాకు వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న ఆలోచనలు గతంలోనూ జరిగాయని, అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు.

Updated : 22 Feb 2022 06:28 IST

ఔరంగాబాద్‌ (మహారాష్ట్ర): భాజపాకు వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న ఆలోచనలు గతంలోనూ జరిగాయని, అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సమావేశం కావడంపై ఆయన స్పందించారు. ఈ మేరకు సోమవారం ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా భేటీ కావడం కొత్తేమీ కాదని ఫడణవీస్‌ అన్నారు. 2014 నుంచి 2019 మధ్య తాను సీఎంగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్‌ తనను కలిశారని గుర్తుచేశారు. భాజపాకు వ్యతిరేకంగా కూటమి కట్టడం గురించి మాట్లాడుతూ.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. భాజయేతర పార్టీల ఐక్యత సాధ్యమయ్యే పనికాదని, ఆ విషయం ఇది వరకే నిరూపితమైందన్నారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీయే గెలుపు సాధించబోతోందని దేవేంద్ర ఫడణవీస్‌ జోస్యం చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధిచిందని గుర్తుచేశారు. ఇక ఉద్ధవ్‌ నేతృత్వంలోని ఉద్ధవ్‌ ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడుతోందని ఆరోపించారు. కరవు పీడిత ప్రాంతాలను బయటపడేసేందుకు గతంలో తాము తీసుకొచ్చిన పథకాలను ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు