Sudha Murty: అబ్దుల్‌ కలాం ఫోన్‌ చేస్తే రాంగ్‌ నంబర్‌ అని చెప్పా: సుధామూర్తి

Sudha Murty: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి ఫోన్‌ వస్తే తాను ‘రాంగ్‌ నంబర్‌’ అని చెప్పానని అన్నారు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి. నాటి ఆసక్తికర సంభాషణను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

Published : 26 Jun 2024 10:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగానే కాక.. రచయిత్రి, వితరణశీలిగా ఎంతోమందికి సుపరిచితురాలు సుధామూర్తి (Sudha Murty). తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి తనకు ఓసారి ఫోన్‌ వచ్చిందని తెలిపారు. తానే దాన్ని నమ్మలేక ‘రాంగ్‌ నంబర్‌’ అని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.

2006లో కలాం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్నప్పటి ఫొటోను షేర్‌ చేసిన సుధామూర్తి.. మాజీ రాష్ట్రపతితో తన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను పంచుకున్నారు. ‘‘ఒక రోజు నాకో ఫోన్‌ కాల్‌ వచ్చింది. అబ్దుల్‌ కలాం (Abdul Kalam) నాతో మాట్లాడాలనుకుంటున్నట్లు ఆపరేటర్‌ చెప్పారు. ఆయనతో నాకు ఎలాంటి పరిచయం లేదు కాబట్టి నేను వెంటనే ‘రాంగ్ నంబర్‌’ అని చెప్పా. నా భర్త నారాయణమూర్తి (Narayana Murty)కి చేయబోయి పొరబాటున నాకు చేశారేమో చూసుకోండి అని అన్నా. అప్పుడు ఆపరేటర్‌ స్పందిస్తూ ‘కలాంజీ ప్రత్యేకంగా మీతోనే మాట్లాడాలని చెప్పారు అని అన్నారు. నేను ఒకింత ఆందోళనకు గురయ్యా. ఆ తర్వాత అబ్దుల్‌ కలాంజీ నాతో మాట్లాడారు. ‘ఐటీ డివైడ్‌’ అనే అంశంపై నేను రాసిన కాలమ్‌ తాను చదివానని, బాగుందని చెప్పారు’’ అంటూ నాటి సంగతిని గుర్తుచేసుకున్నారు.

అయోధ్యలో రూ.650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌’

సుధామూర్తి (Sudha Murty) రచయిత్రిగా అనేక పుస్తకాలు రాశారు. సాహిత్యంలో ఆమె చేసిన సేవలకు గానూ సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌తో కేంద్రం ఆమెను సత్కరించింది. ఈ ఏడాది ఆరంభంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని