Sunny Leone: సన్నీ లియోన్‌ ప్రదర్శనకు ఆ యూనివర్సిటీ ‘నో’!

నటి సన్నీ లియోన్‌ తలపెట్టిన ఓ ప్రదర్శనకు కేరళ యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది.

Updated : 13 Jun 2024 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి సన్నీ లియోన్‌ తలపెట్టిన ఓ ప్రదర్శనకు కేరళ యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. ఈ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వకూడదని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌.. రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. గతంలో చోటుచేసుకున్న విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తిరువనంతపురంలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో జులై 5న ఈ ప్రదర్శన నిర్వహించాలని భావించారు.

గతేడాది ఎర్నాకుళం జిల్లాలోని కొచ్చిన్‌ యూనివర్సిటీ (CUSAT)లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సన్నీ లియోన్‌ పాల్గొన్నారు. ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి గాయాలయ్యాయి. ఆ ఘటనను కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అది పూర్తిగా నిర్వహణ వైఫల్యమేనని, అటువంటివి పునరావృతం కాకూడదని ఆదేశించింది.

పలు భారతీయ భాషాచిత్రాల్లో నటిస్తోన్న సన్నీ లియోన్‌.. మలయాళ సినిమాల్లోనూ అడుగు పెట్టనున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రాజెక్టు ముహుర్తానికి సంబంధించిన విషయాన్ని సోషల్‌ మీడియాలో ఇటీవల వెల్లడించారు. బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసిన సన్నీ.. తెలుగులోనూ నటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని