Single-Use Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా
దిల్లీ: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై నేటి నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి రూ.లక్ష వరకు జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం వెల్లడించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించకుండా వాటికున్న ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించేందుకు దిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో ఓ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ‘‘ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నేటి నుంచి నిషేధం ఉంది. ఈ నిషేధం పక్కాగా అమలు చేయడంలో భాగంగా దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ దిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. ఇందులో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే జులై 10 వరకు వార్నింగ్ నోటీసులు జారీ చేస్తాం. కానీ, ఆ తర్వాత కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి వారిపై రూ.లక్ష వరకు జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నాం’’ అని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధించగా.. జులై 1 నుంచి అది అమల్లోకి వచ్చింది. మొత్తంగా 16 రకాల వస్తువులపై నిషేధం విధించింది.
నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు ఇవే..
- ఇయర్ బడ్స్ (Earbuds with Plastic Sticks)
- బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్ (Plastic sticks for Balloons)
- ప్లాస్టిక్ జెండాలు (Plastic Flags)
- క్యాండీ స్టిక్స్-పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు (Candy Sticks)
- ఐస్‌క్రీమ్ పుల్లలు (Ice-cream Sticks)
- అలంకరణ కోసం వాడే థర్మోకోల్ (Thermocol)
- ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు..
- వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్
- ఆహ్వాన పత్రాలు (Invitations)
- సిగరెట్ ప్యాకెట్లు (Cigarette Packets)
- 100 మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు (Plastic or PVC Banners)
- ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు (Stirrers)
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
-
Sports News
Roger Federer : రోజర్ ఫెదరర్.. ఐదేళ్ల కిందట హామీ.. తాజాగా నెరవేర్చి..
-
Politics News
Kejriwal: ఒకే ఒక్క అడుగు.. అది వేస్తే మనమూ సాధించినట్లే..!
-
General News
Wayanad Collector: ఇంట్లో ఉండటం చాలా కష్టం..! విద్యార్థిని ఈమెయిల్ వైరల్
-
General News
TTD: ఆ ఐదురోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. తితిదే విజ్ఞప్తి
-
India News
UP: మహిళపై వేధింపులు.. పరారీలో ఉన్న భాజపా నేత అరెస్టు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- ASIA CUP 2022: నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తా: మాజీ సెలక్టర్
- CWG 2022: 90.18 మీటర్ల రికార్డు త్రో.. అభినందించిన నీరజ్ చోప్రా