Bilkis Bano case: బిల్కిస్‌ బానో కేసులో.. ప్రత్యేక బెంచ్‌కు సుప్రీం ఓకే

బిల్కిస్‌ బానో(Bilkis Bano) వేసిన పిటిషన్‌ విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 

Published : 22 Mar 2023 20:21 IST

దిల్లీ: 2002 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో అత్యాచారానికి గురైన బిల్కిస్‌బానో(Bilkis Bano) వేసిన పిటిషన్‌ విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు మంగళవారం సుప్రీంకోర్టు(Supreme Court) అంగీకరించింది. అత్యాచార ఘటన కేసులో దోషులు కొద్దినెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఆ దోషులకు రెమిషన్ మంజూరు చేయడంపై ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కొత్త బెంచ్‌ ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చింది. అలాగే కేసు లిస్టింగ్‌కు ఒక తేదీని కేటాయిస్తామని చెప్పింది. 

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో(Bilkis Bano) కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. గతేడాది ఆగస్టు 15న వారు విడుదలయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని