Notes Ban: ఆరేళ్ల తర్వాత.. ‘నోట్ల రద్దు’పై సుప్రీం విచారణ

నల్లధన నిర్మూలనే లక్ష్యంగా 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై

Published : 27 Sep 2022 17:17 IST

దిల్లీ: నల్లధన నిర్మూలనే లక్ష్యంగా 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఆరేళ్ల తర్వాత విచారణకు సిద్ధమైంది.

నోట్ల రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం (సెప్టెంబరు 28న) విచారణ చేపట్టనుంది. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వీటిని విచారించనుంది. నేటి నుంచి సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న నేపథ్యంలో నోట్ల రద్దుపై విచారణను కూడా దేశ ప్రజలు వీక్షించొచ్చు.

2016 నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థలో నల్లధనం తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో కేంద్రం తెలిపింది. ఆ తర్వాత కొన్నాళ్లకు రూ.500 కొత్త నోటుతో పాటు రూ.2వేల నోటును కేంద్రం చలామణీలోకి తీసుకొచ్చింది. అయితే దీనిపై కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. తన పెట్టుబడిదారీ స్నేహితులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా మోదీ నోట్ల రద్దును తీసుకొచ్చారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనేక సార్లు ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 2016 డిసెంబరు 16నే సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది. అయితే ఇప్పటివరకూ దీనిపై విచారణ చేపట్టకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని