UG NEET exam: నీట్‌-2021 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం కుదరదు: సుప్రీంకోర్టు

వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌(యూజీ)-2021 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు

Updated : 04 Oct 2021 16:44 IST

దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌(యూజీ)-2021 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సెప్టెంబరు 12న జరిగిన నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

నీట్‌-2021 పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్‌, మాల్ ప్రాక్టీస్‌ జరిగినట్లు దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారించింది. లక్షలాది మంది విద్యార్థులు హాజరైన పరీక్షలో పేపర్ లీక్‌ అయ్యిందని చెప్పి మరోసారి పరీక్ష నిర్వహించమని కోరడం సరైంది కాదని.. ఇటువంటి రిట్ పిటిషన్ దాఖలు చేస్తే జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై నీట్‌-2021 పరీక్ష రద్దు విషయంలో ఎటువంటి అభ్యర్థనలు స్వీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా నీట్‌-2021 పరీక్షకు సంబంధించిన ఫలితాలను తుది ‘కీ’ తోపాటు త్వరలో విడుదల చేస్తామని పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని