Supreme Court: ‘సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు.. కంప్యూటర్‌ కొనుక్కోలేరా?!’

‘‘లాయర్‌ గారు.. మీరు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. తరచూ కేసు విచారణ నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు. చక్కగా ఒక కంప్యూటర్‌ కొనుక్కోలేరా?’’అని ఓ కేసు విచారణ నిమిత్తం మొబైల్‌ ఫోన్‌లో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదిని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మరో కేసులో న్యాయవాది

Updated : 17 Jan 2022 20:14 IST

న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం

మొబైల్‌ఫోన్లలో వాదనలపై న్యాయమూర్తుల అసహనం

దిల్లీ: ‘‘లాయర్‌ గారూ.. మీరు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. తరచూ కేసు విచారణ నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు. చక్కగా ఒక కంప్యూటర్‌ కొనుక్కోలేరా?’’అని ఓ కేసు విచారణ నిమిత్తం మొబైల్‌ ఫోన్‌లో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదిని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మరో కేసులో న్యాయవాది మొబైల్‌లో సిగ్నల్స్‌ సరిగా లేకపోవడంతో న్యాయమూర్తులు గట్టిగా అరిచి చెప్పాల్సి వచ్చింది. దీంతో వారు విసిగిపోయి ‘ఇలాంటి కేసులు విచారించే శక్తి మాలో లేదు. దయచేసి మాటలు స్పష్టంగా వినిపించే డివైజ్‌ను తెచ్చుకోండి’’అని న్యాయవాదికి సూచించారు. డిజిటల్‌ విచారణలో న్యాయవాదులు ఆడియో, వీడియో క్లారిటీ లేని మొబైల్ ఫోన్లను వినియోగించడం పట్ల న్యాయమూర్తులు అసహనానికి గురవుతూ పై విధంగా స్పందించారు.

కరోనా నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులను విచారిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పలు కేసుల్ని విచారించింది. ఈ క్రమంలో కొందరు న్యాయవాదులు మొబైల్‌ఫోన్‌ ద్వారా డిజిటల్‌ విచారణలో పాల్గొన్నారు. వారి మొబైల్‌లో వీడియో, ఆడియో సమస్యల వల్ల వాదనలు స్పష్టంగా వినిపించకపోవడంతో న్యాయమూర్తులు దాదాపు పది కేసులను వాయిదా వేశారు. న్యాయవాదుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకపై డిజిటల్‌ విచారణల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని అభిప్రాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని