Gyanvapi Masjid: జ్ఞాన్వాపి మసీదు కేసు.. జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం నిర్ణయం

జ్ఞాన్​వాపి మసీదు కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.......

Published : 20 May 2022 18:58 IST

దిల్లీ: జ్ఞాన్​వాపి మసీదు కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్​ప్రదేశ్​ న్యాయ విభాగానికి సంబంధించి.. సీనియర్​, అనుభవజ్ఞులైన జ్యుడీషియల్​ అధికారి ఈ కేసును విచారించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్​ జడ్జి సీనియర్​ డివిజన్​ నుంచి కేసును వారణాసి జిల్లా​ జడ్జికి బదిలీ చేసినట్లు స్పష్టం చేసింది.

మసీద్​ కమిటీ పిటిషన్​పై​ ప్రాధాన్యతను బట్టి జిల్లా జడ్జి నిర్ణయం తీసుకుంటారని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. శివలింగం కనిపించిన ప్రాంతానికి రక్షణ కల్పించటం, ముస్లింలు నమాజ్​ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ మే 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మరోవైపు.. హిందూ భక్తులు వేసిన సివిల్​ సూట్​పై వారణాసి జిల్లా జడ్జి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. జ్ఞాన్​వాపి మసీదులో నమాజ్​ చేసుకునే ముస్లింలకు తగిన ఏర్పాట్లు  చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా మేజిస్ట్రేట్​ను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని