PM Security Breach: ఏకపక్ష విచారణకు వదిలేయలేం.. స్వతంత్ర దర్యాప్తు అవసరం : సుప్రీం
ఇటీవల పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దిల్లీ: ఇటీవల పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు, పంజాబ్-హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, చండీగఢ్ డీజీపీ, పంజాబ్ సెక్యూరిటీ ఏడీజీ కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. భద్రతా లోపం కారణంగా తలెత్తిన ప్రశ్నలను ఏకపక్ష విచారణకు వదిలేయలేమని.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని సుప్రీం స్పష్టం చేసింది. భద్రతా వైఫల్యానికి గల కారణం, బాధ్యులెవరో గుర్తించడంతో పాటు.. భవిష్యత్తులో ఈ తరహా పరిణామాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ కమిటీ దృష్టిసారించనుంది.
ఇటీవల ప్రధాని మోదీ పంజాబ్‌లో పర్యటించారు. వాతావరణం అనుకూలించక ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. దీనిపై ముందుగానే పంజాబ్ డీజీపీకి సమాచారమిచ్చారు. మోదీ ప్రయాణించే మార్గంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీసుల ధ్రువీకరణ తర్వాతే ప్రధాని కాన్వాయ్‌లో బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ వద్దకు చేరుకునే సరికి అప్పటికే కొందరు ఆందోళనకారులు రోడ్డును నిర్బంధించారు. దీంతో ఫ్లైఓవర్‌పై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మోదీ కాన్వాయ్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాహనాల నుంచి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దాదాపు 20 నిమిషాల పాటు మోదీ కాన్వాయ్ ఫ్లైఓవర్‌పైనే చిక్కుకుపోయింది. ఆ తర్వాత ప్రధాని కాన్వాయ్ వెనుదిరిగి భఠిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయింది.
సాధారణంగా ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గంలో కఠినమైన భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటిస్తారు. సాధారణ వాహనాలను అనుమతించరు. అలాంటిది ప్రధాని ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మొత్తం అంశంపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర, పంజాబ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు.. తమ దర్యాప్తులను నిలిపివేయాలని ఆ సందర్భంగా సుప్రీం ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్‌కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్‌ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్‌కు చెందిన 58 ఏళ్ల దేవ్‌కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్‌వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్‌ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ