Supremecourt: న్యాయమూర్తికే ఉద్దేశాలు ఆపాదిస్తారా!.. సుప్రీం ఆగ్రహం

న్యాయస్థానాలను అపహాస్యం చేసే ధోరణి ఇటీవల కాలంలో పెరిగిపోయిందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 19 Nov 2022 06:47 IST

కోర్టు ధిక్కరణ నోటీసులిస్తూ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు

దిల్లీ: న్యాయస్థానాలను అపహాస్యం చేసే ధోరణి ఇటీవల కాలంలో పెరిగిపోయిందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జికి ఉద్దేశాలు ఆపాదిస్తూ ఆరోపణలు చేసిన న్యాయవాదులకు, ఓ పిటిషనర్‌కు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘జడ్జి.. తప్పులు చేయకూడదని ఏమీ లేదు. పొరపాటున తప్పుడు ఉత్తర్వులు ఇచ్చి ఉండొచ్చు. దాన్ని తర్వాత పక్కన పెట్టొచ్చు కూడా. అంత మాత్రాన ఉద్దేశాలు ఆపాదించడాన్ని అనుమతించం’’ అని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని