సీజేఐ జస్టిస్‌ బోబ్డేకి అశ్వినీకుమార్‌ లేఖ

దేశంలో కరోనా విజృంభిస్తుండటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డేకి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశ్వినీ కుమార్ లేఖ రాశారు. కరోనా ఉద్ధృతిపై

Published : 16 Apr 2021 21:38 IST

దిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తుండటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డేకి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశ్వినీ కుమార్ లేఖ రాశారు. కరోనా ఉద్ధృతిపై సుమోటోగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 2 లక్షల కేసులు దాటడాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. ఎన్నికల ర్యాలీలు, ధర్నాలపై నిషేధం విధించాలని కోరారు. అలాగే కొవిడ్‌ టీకా ఎగుమతులపై నిషేధం విధించాలని.. అన్ని వయసుల వారికీ టీకా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని