Supremecourt: న్యాయమూర్తిని ‘ఉగ్రవాది’ అంటావా!

ప్రజా సర్వీసులకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా కక్షిదారు.. ఓ న్యాయమూర్తిని ‘ఉగ్రవాది’గా సంబోధిస్తూ ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 26 Nov 2022 09:26 IST

కక్షిదారుకు నోటీసు జారీ చేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: ప్రజా సర్వీసులకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా కక్షిదారు.. ఓ న్యాయమూర్తిని ‘ఉగ్రవాది’గా సంబోధిస్తూ ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కక్షిదారుకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించింది. ‘కొన్ని నెలలు నిన్ను జైలుకు పంపితే అప్పుడు తెలిసి వస్తుంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కొహ్లీల ధర్మాసనం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  న్యాయవాది సూచన మేరకు బేషరతు క్షమాపణ చెప్పిన  కక్షిదారు తాను తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కోర్టుకు నివేదించారు. ఈ నేరానికి కోర్టు ధిక్కారం కింద నిన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని నోటీసు జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు మూడు వారాలకు వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని